Dhanush: ధనుష్ ‘మారన్’ ఓటీటీకి వెళ్తుందా..?

కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన సమయంలో చాలా సినిమాలను ఓటీటీలో విడుదల చేశారు. తెలుగులో స్టార్ హీరోలు ఓటీటీకి వెళ్లడానికి భయపడినా.. కోలీవుడ్ లో మాత్రం సూర్య, ధనుష్ లాంటి స్టార్లు తమ సినిమాలను డిజిటల్ లో రిలీజ్ చేశారు. సూర్య సినిమా సక్సెస్ అయినప్పటికీ.. ధనుష్ కి మాత్రం ఓటీటీలో సక్సెస్ రాలేదు. అయినప్పటికీ మరోసారి ఆయన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

ధనుష్ నటించిన ‘మారన్’ సినిమా డిజిటల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాను మంచి రేటు పెట్టి డిస్నీ హాట్ స్టార్ సంస్థ కొనుక్కుందట. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్లతో ఆసక్తి పెంచిన మేకర్స్ ఇప్పుడు సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియక ధనుష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

నిజానికి ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు పెద్ద గొడవ జరిగింది. ఓ స్టార్ హీరో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడమేంటని ఎగ్జిబిటర్లు నిలదీశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఓటీటీ రిలీజ్ మంచిదని అనుకున్నారంతా. ఇప్పుడు ‘మారన్’ సినిమాను ఓటీటీకి తీసుకెళ్లే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాపై నమ్మకం లేకనే థియేటర్లలో రిలీజ్ చేయడం లేదా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus