Dhanush: పవన్, ఎన్టీఆర్ గురించి ధనుష్ కామెంట్స్ వైరల్.. ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ధనుష్ (Dhanush) ఒకరు. ధనుష్ త్వరలో రాయన్ (Raayan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో ధనుష్ చేసిన కామెంట్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ హీరోలలో ఫేవరెట్ ఎవరనే ప్రశ్నకు ధనుష్ స్పందిస్తూ నేను సమాధానం చెబుతాను కానీ ఇతర హీరోల అభిమానులు నన్ను ద్వేషించొద్దని ధనుష్ అన్నారు.

ఐ లవ్ సినిమా ఐ లవ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సార్ అని ధనుష్ వెల్లడించారు. ధనుష్ చెప్పిన జవాబు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో (Jr NTR)  చేస్తానని ధనుష్ వెల్లడించారు. తారక్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తానని ధనుష్ చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

నాకు సరైన సమయంలో సరైన డైరెక్టర్లు, నటులతో కలిసి పని చేసే ఛాన్స్ వచ్చినందుకు లక్ గా భావిస్తున్నానని ఆయన తెలిపారు. నా కెరీర్ లో నా తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని ధనుష్ పేర్కొన్నారు. నాకు నటనపై ఎంత ప్రేమ ఉందో డైరెక్షన్ పై కూడా అంతే ప్రేమ ఉందని ఆయన వెల్లడించారు. రాయన్ మూవీ ఆ ఇష్టం నుంచి తెరకెక్కిన సినిమానే అని ధనుష్ చెప్పుకొచ్చారు.

నా నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సైతం ఈ సినిమా నచ్చుతుందని భావిసున్నానని ధనుష్ అన్నారు. ఈ నెల 26వ తేదీన థియేటర్లలో సినిమా చూసి ఆస్వాదించాలని ధనుష్ వెల్లడించారు. ధనుష్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus