Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

కోలీవుడ్ లో నటన, దర్శకత్వం, రచన, నిర్మాణం అంటూ ఆల్ రౌండర్ గా పేరొందిన నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ (Dhanush), ఇప్పుడు టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేయడానికి పూర్తిస్థాయిలో సిద్ధమైపోయాడు. ‘సార్’ (Vaathi) సినిమాతో ఆల్రెడీ స్ట్రైట్ తెలుగు మూవీ చేశాడు. ఈ మధ్యనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ (Kuberaa) తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

Dhanush

తమిళంలో ఇతను వంద కోట్ల హీరో, నార్త్ లో మాత్రం సక్సెస్ కాలేదు. అయితే తెలుగులో బాగానే క్లిక్ అయ్యాడు. ‘కుబేర’ (Kuberaa) తో 2వ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో తెలుగు సినిమాకి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ‘సార్’ (Vaathi) చిత్రంతో ధనుష్‌ (Dhanush) లోని మాస్ టీచర్‌ను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ధనుష్.

అయితే, ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళడానికి 2027 వరకు టైం పడుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే, అప్పటివరకు ధనుష్ (Dhanush) చేతినిండా తమిళ ప్రాజెక్టులతో పాటు ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయట.

అయినాసరే, ఈ గ్యాప్‌లో మరికొందరు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, బడా నిర్మాతలు కూడా ధనుష్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారని ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ కూడా ధనుష్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తుందట. మరోపక్క దిల్ రాజు (Dil Raju) కూడా ధనుష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus