సగటు కుర్రాడిగా ధనుష్ కనిపిస్తే విజయం పక్కానా? రీసెంట్ సినిమా ‘తిరు చిత్రాంబళం’ అందుకున్న విజయం చూస్తే ఈ విషయం పక్కాగా అర్థమవుతోంది. అదనపు హంగులు లేకుండా ధనుష్ కనిపిస్తే విజయంతోపాటు భారీ వసూళ్లు పక్కా అని మరోసారి నిరూపించింది ‘తిరు చిత్రాంబళం’. ఎందుకంటే ఆ సినిమాకు ప్రపంచవ్యాప్త వసూళ్లు ఇప్పటివరకు రూ. 100 కోట్లు దాటిపోయాయి. దీంతో కోలీవుడ్‌కి ఈ ఏడాది మరో భారీ హిట్‌పడింది అని సంతోషపడుతున్నారు.
ఆగస్టు 18న ఓ మోస్తరు అంచనాలతో విడుదలైంది ‘తిరు చిత్రాంబళం’. ధనుష్ గత సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో.. ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. ఈ చిత్ర దర్శకుడు మిత్రన్ జవహార్ ఇప్పటిదాకా తీసినవి రీమేక్‌లే కావడంతో ఈ సినిమా మీద అంతగా అంచనాలు ఏర్పడలేదు. సినిమా ప్రచారం విషయంలోనూ టీమ్ అంత ఆసక్తిగా కనిపించలేదు. ట్రైలర్ చూస్తే ‘రఘువరన్ బీటెక్’ తరహాలో కనిపించింది. కొత్తగా ఏమీ ఉండదా అనుకుంటుండగా.. రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. ఇప్పుడు వసూళ్లు భారీగా వస్తున్నాయి.
తమిళంలో ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ‘విక్రమ్’ మినహా మిగిలిన ఏవీ సరిగ్గా ఆడలేదు. దీంతో సరైన సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ‘తిరు’ లాంటి సగటు తమిళ సినిమా వచ్చేసరికి థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో సినిమా వసూళ్లు సాధారణంగా మొదలై ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరాయి. వసూళ్లపరంగా చూస్తే.. ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో ధనుష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా కనిపిస్తాడు. ఓ ఘటన కారణంగా తండ్రితో ధనుష్ మాట్లాడకుండా ఉంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి నిత్య మేనన్, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ వస్తారు. వారెవరు, ఎందుకొచ్చారు, ఏం చేశారు, అఖరిగా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది కథ. అన్నట్లు ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’ సినిమాల జోరులో సైడైపోయింది.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!