Dhanush: ‘విరాటపర్వం’ డైరెక్టర్ తో ధనుష్..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హాలీవుడ్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంతో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే ‘సార్’ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంటే ముందే శేఖర్ కమ్ములతో సినిమా కమిట్ అయ్యారు ధనుష్. అది ఆలస్యమవ్వడంతో ‘సార్’ సినిమాను పట్టాలెక్కించారు.

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ధనుష్ కోసం మరో ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా ఉంది. ‘నీది నాదీ ఒకే కథ’ అనే సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న వేణు ఊడుగుల ఇటీవల ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా వర్కవుట్ అవ్వలేదు కానీ ఓటీటీలో మాత్రం బాగానే ఆడింది. కలెక్షన్స్ రానప్పటికీ విమర్శకుల ప్రశంసలు ఆడుకుంది.

దర్శకుడిగా వేణుకి మంచి మార్కులే వచ్చాయి. వేణు ఊడుగులకి కొన్నాళ్లక్రితం సితార ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ అడ్వాన్స్ ఇచ్చింది. దీంతో అతడికి హీరోని సెట్ చేసే పనిలో పడింది సితార సంస్థ. ధనుష్ నటిస్తోన్న ‘సార్’ సినిమా సితార బ్యానర్ లో తెరకెక్కుతున్నదే. ఇప్పుడు మరోసారి ధనుష్ ని లాక్ చేయాలని భావిస్తోంది సదరు సంస్థ. వేణు కథతో ధనుష్ ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్నారు. ఇటీవలే ధనుష్-వేణు ఊడుగుల మధ్య కథా చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.

త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ రానుంది. ఇక ‘సార్’ సినిమా విషయానికొస్తే.. మొదట డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus