బిగ్ బాస్ 4: అప్పట్లో నేను రిలేషన్ షిప్ లో ఉన్నా..!

దేత్తడి హారిక అంటే సోషల్ మీడియాలో సెన్సేషన్. గత కొన్ని రోజులుగా హారిక పాస్ట్ లవ్ స్టోరీ ఇదే అంటూ చాలామంది కథలు కథలుగా వినిపించారు. అయితే, రీసంట్ గా హారిక మదర్ జ్యోతిగారు ఇచ్చిన ఇంటర్య్వూలో వాళ్ల అమ్మాయికి ఎలాంటి లవ్ స్టోరీ లేదని, ఉంటే ఖచ్చితంగా మాకు చెప్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. కానీ, హారిక రీసంట్ గా బిగ్ బాస్ ఇచ్చిన అతి పెద్ద సీక్రట్ టాస్క్ లో తన లవ్ స్టోరీని బయటపెట్టింది.

అమ్మా ఐయామ్ వెరీ సారీ… అంటూ తన గతం గురించి చెప్పింది. నాలుగున్నార సంవత్సరాలు ఒక అబ్బాయితో లవ్ లో ఉన్నానని, రిలేషన్ షిప్ లో ఉండేదాన్ని అని చెప్పింది. కానీ తర్వాత బ్రేక్ అప్ అయిపోయిందని, బ్రేక్ అప్ అయిపోయి కూడా రెండు సంవత్సరాలు అవుతోందని చెప్పింది హారిక. ఇది నీ దగ్గర అన్నయ్య దగ్గర దాచాను అని నువ్వు ముందు ఉంటే ఖచ్చితంగా చెప్పలేను అని ఇప్పుడు లేవు కాబట్టి ధైర్యంగా చెప్తున్నానని తన మనుసులో మాటని చెప్పింది హారిక.

నిజంగా ఇలాంటి విషయాలు పేరేెంట్స్ కి చెప్పాలంటే చాలా గట్స్ కావాలి. అలాంటింది ఒక రియాలిటీ షోలో ప్రపంచం అంతా తెలిసేలా ఇలాంటి విషయాన్ని చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అందరికంటే అతి పెద్ద సీక్రట్ చెప్పింది మాత్రం ఖచ్చితంగా హారికే అని అంటున్నారు బిగ్ బాస్ వీక్షకులు. అంతేకాదు, ఈ సీక్రెట్ టాస్క్ చేస్తేనే ఆప్తుల నుంచి లేఖ వస్తుందని చెప్పాడు బిగ్ బాస్ సో , పార్టిసిపెంట్స్ కి చెప్పక తప్పలేదు. అదీ విషయం.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus