జనతా గ్యారేజ్ కి మెగా దెబ్బ
- November 30, 2016 / 06:21 AM ISTByFilmy Focus
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ధృవ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ వీడియో అత్యంత వేగంగా ఒక మిలియన్ వ్యూస్ ని సాధించింది. దాదాపు రెండు నిముషాల నిడివి కలిగిన ఈ వీడియోని 4 .5 గంటల్లో 10 లక్షల మంది చూసారు. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ పేరిట ఉన్న రికార్డ్ బద్దలు అయింది. ఈ చిత్రం ట్రైలర్ ఒక మిలియన్ మార్క్ ని చేరుకోవడానికి 10.5 గంటల సమయం పట్టింది. దీంతో టాలీవుడ్ సినిమాల్లో ఫాస్టెస్ట్ గా వన్ మిలియన్ వ్యూస్ సాధించిన మూవీగా ధృవ క్రెడిట్ సొంతం చేసింది. అంతేకాదు ఐదు రోజుల్లో ధృవ ట్రైలర్ ని వీక్షించిన వారి సంఖ్య 44 లక్షలు గా ఉంది.
ఈ నంబర్ గంటగంటకు పెరుగుతోంది. ట్రైలర్ ఎక్కువమంది చూసినంత మాత్రాన ఆ మూవీ తప్పనిసరిగా హిట్ అవుతుందని చెప్పలేము కానీ.. ఆ సినిమాపై ఎంతమంది ఆసక్తిగా ఉన్నారనే విషయాన్నీ ఇది స్పష్టం చేస్తుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే మొదటి నుంచే ఈ చిత్రం పై భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ట్రైలర్ మరింత పెంచింది. తమిళ నటుడు అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 9న విడుదల కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















