ధృవ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ హిట్ బాట పట్టారు. డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్. వి. ప్రసాద్ లు సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రంరిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. చెర్రీ హీరోయిజంకి తోడు అరవింద్ స్వామి ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ స్కిన్ షో కలెక్షన్లను పెంచడానికి దోహదం చేస్తోంది. మంగళవారం నాటికి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ విషయంలో అదే జోరు చూపించింది. టోటల్ షేర్ 28.71 కోట్లు రాబట్టి మెగాపవర్ ని ట్రేడ్ వర్గాలకు మరో సారి రుచి చూపించింది.అమెరికాలో ఈ మూవీ సోమవారానికి ఒక మిలియన్ డాలర్ల మార్క్ ని దాటి రికార్డు సృష్టించగా, ఈ వీకెండ్ కి 2 మిలియన్ కి చేరుకొని చరణ్ సత్తా చాటేందుకు దూసుకుపోతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో షేర్ ప్రాంతాల వారీగా…
ఉత్తరాంధ్ర 3.74 కోట్లు
పశ్చిమ గోదావరి 1.99 కోట్లు
తూర్పు గోదావరి 2.28 కోట్లు
కృష్ణా 2.11 కోట్లు
గుంటూరు 2.49 కోట్లు
నెల్లూరు 94 లక్షలు
నైజాం 10.24 కోట్లు
సీడెడ్ 4.92 కోట్లు
మొత్తం 28.71 కోట్లు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.