వేగం పెంచిన రామ్ చరణ్
- June 21, 2016 / 06:29 AM ISTByFilmy Focus
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వేగం పెంచాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తాను నటిస్తున్న”ధృవ” సినిమా ముందుగా అనుకున్న టైంకే రిలీజ్ అయ్యేలా శ్రమిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ గచ్చిబౌలి లో గత వారం జరిగింది. ఇక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న టీం ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా కాశ్మీర్ కి బయలు దేరింది.
మొదటి షెడ్యూల్ కూడా అక్కడే జరిగింది. కాశ్మీర్ లో కొన్ని కీలక సన్నివేశాలను ఈ సారి పూర్తి చేయనున్నారు. తమిల్ మూవీ “తని ఒరువన్” కు రిమేక్ అయినా ఈ చిత్రంలో ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీతీ సింగ్ మరో సారి రామ్ చరణ్ తేజ్ తో జోడి కట్టింది. ఇందులో అరవింద్ స్వామీ ప్రతి కథానాయకుడిగా నటిస్తుండగా యువ నటుడు నవదీప్ ప్రతేక పాత్రలో కనిపించనున్నాడు. అథ్లెట్ బాడీతో, ట్రైనీ ఐపీఎస్ అధికారిగా చరణ్ పవర్ ఫుల్ యాక్షన్ చూపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
N it’s touchdown Kashmir !! #shoot #dhruva #let the madness begin !! pic.twitter.com/YtG1bxZv6Y
— Rakul Preet (@Rakulpreet) June 19, 2016

















