Ananya Panday: డ్రగ్స్ తో సంబంధం లేదంటున్న బ్యూటీ!

ముంబై తీరంలో కూర్జ్ షిప్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఫ్రెండ్ అయిన నటి అనన్య పాండేను విచారిస్తోంది ఎన్సీబీ. ఆమె ఇంటి నుంచి రెండు మొబైల్ ఫోన్లను, ఒక ల్యాప్ టాప్ ను ఎన్సీబీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.

అయితే ఇందులోని వాట్సాప్‌ చాటింగ్‌లు, ఫొటోలు, వాయిస్‌ నోట్లను ఆనన్య పాండే చాలావరకు తొలగించినట్లు ఎన్‌సీబీ గుర్తించింది. డిలీట్‌ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఆర్యన్ ఖాన్ తో అనన్య చేసిన చాటింగ్ లో కొన్ని అనుమానాస్పద ఆర్ధిక లావాదేబీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అనన్యను ప్రశ్నిస్తుంటే.. ఆమె ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

తనకు అసలు డ్రగ్స్ అలవాటే లేదని.. డ్రగ్స్ ను కొనడానికి ఆర్యన్ కు ఎలాంటి సాయం చేయలేదని.. అతడితో తనకు ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు లేవని చెప్పింది. ఆర్యన్ కు డ్రగ్స్ సప్లై చేసేవారి గురించి అనన్య తెలుసని.. ఎన్సీబీ అనుమానిస్తోంది. ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 30న విచారణ చేపడతామని ముంబై హైకోర్టు వెల్లడించింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus