Robin Hood: ‘రాబిన్ హుడ్’ లో నిజంగా వార్నర్ నటించాడా?

లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేసి ఎంటర్టైన్ చేసిన వాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. పేరుకు ఇతను ఆస్ట్రేలియా ఆటగాడే. కానీ తెలుగు వాళ్ళకి పెద్ద అభిమాని. 2020 టైంలో మహేష్ బాబు (Mahesh Babu) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు స్టెప్పులు వేశాడు. అదే టైంలో వచ్చిన అల్లు అర్జున్ (Allu Arjun) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమాలోని ‘రాములో రాములా’ సాంగ్ కి కూడా డాన్సులు వేశాడు.

Robin Hood

అతని డాన్సులకి అల్లు అర్జున్, మహేష్ బాబు..లు ట్విట్టర్లో థాంక్స్ చెప్పారు. అక్కడితో వార్నర్ ఆగలేదు. అప్పటికి టిక్ టాక్ ఉండేది. అందులో వీడియోలు చేసేవాడు. ముఖ్యంగా తెలుగు సినిమాల డైలాగులకి అతని హావభావాలు పలికిస్తూ చేసిన వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక ‘పుష్ప’ (Pushpa) రిలీజ్ టైంలో కూడా తెగ రీల్స్ చేసేవాడు వార్నర్.

దీంతో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లో వార్నర్ యాక్ట్ చేస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కానీ ‘పుష్ప'(సిరీస్) నిర్మాతలు చేసిన ‘రాబిన్ హుడ్’ లో ఇతను నటించాడు అనే టాక్ నడిచింది. ఈరోజు హైదరాబాద్లో నిర్వహించిన ‘రాబిన్ హుడ్’ (Robin Hood) ఈవెంట్లో చిత్ర బృందాన్ని ఈ విషయమై ప్రశ్నించగా..

‘దాని గురించి అప్పుడే చెప్పడం ఎందుకు’ అన్నట్టు మాట దాటేశారు. దీంతో ‘వార్నర్ ని గ్రాఫిక్స్ ద్వారా తీసుకొచ్చారా?’ అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇందులో వార్నర్ నటించాడట. లండన్లో జరిగిన షెడ్యూల్లో 3 రోజుల పాటు ‘రాబిన్ హుడ్’ (Robinhood) షూటింగ్లో పాల్గొన్నాడట వార్నర్. ఇలా కనిపించి అలా మాయమైపోయే పాత్ర అది అని సమాచారం.

‘గేమ్‌ ఛేంజర్‌’లో శ్రీకాంత్‌ లుక్‌ వెనుక ఆసక్తికర విషయం.. ఏంటంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus