Vijay Varma: విజయ్ తో ఉన్నది తమన్నాయేనా..?

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దకాలం దాటిపోయినా.. ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ నటిగా రాణిస్తోంది. అయితే కొన్నాళ్లుగా ఈమె విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. గోవాలో 2023 న్యూఇయర్ వేడుకలు జరుపుకుంది ఈ జంట. ఆ సమయంలో ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్న వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొట్టింది. ఆ తరువాత ఇద్దరి ప్రేమాయణం గురించి బయటకొచ్చింది.

తాము ప్రేమలో ఉన్నట్లు ఇటు తమన్నా గానీ.. అటు విజయ్ వర్మ కానీ ఎప్పుడూ చెప్పలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో విజయ్ వర్మ చేసిన ఒక పోస్ట్ చూస్తే.. తమన్నాతో డేటింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేశారనే అనుకోవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ వర్మ ఒక ఫొటో పోస్ట్ చేశారు. అందులో మనుషుల ముఖాలు ఏమీ కనిపించడం లేదు. ఇద్దరి కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మధ్యలో హార్ట్ ఎమోజీ ఉంది.

అందులో ఉన్నవి విజయ్ వర్మ, తమన్నా కాళ్లు అని నెటిజన్లు భావిస్తున్నారు. వారిద్దరూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించడానికి రెడీ అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తమన్నా ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికింద విజయ్ వర్మ కామెంట్ చేశారు. ఇక తమన్నా, విజయ్ ల కెరీర్ విషయానికొస్తే..

నటులుగా ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమన్నా చిరంజీవికి జోడీగా ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటిస్తోంది. హిందీలో ‘బోల్ చుడీయా’, మలయాళంలో ‘బాంద్రా’ సినిమాలు చేస్తోంది. అలానే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus