తెలుగులో పదుల సంఖ్యలో సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలో “ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే” పాటతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముమైత్ కు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అలీతో సరదాగా షోకు గెస్ట్ గా ముమైత్ ఖాన్ హాజరయ్యారు. ముమైత్ ఖాన్ ఆ షోలో తన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముమైత్ ఖాన్ అమ్మ తమిళియన్ కాగా నాన్న కుటుంబమంతా పాకిస్తాన్ లో ఉండేది. ముమైత్ నాన్న కుటుంబం మైగ్రేషన్ సమయంలో ఇండియాకు వచ్చింది.
ఈ విధంగా ముమైత్ ప్రత్యక్షంగా కాపోయినా పరోక్షంగా పాక్ దేశపు అమ్మయి అని చెప్పారు. ముమైత్ తల్లిదండ్రులు ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఇరుగుపొరుగువాళ్లు కాగా ఆ సమయంలో ఏర్పడిన పరిచయం వల్ల వాళ్ల వివాహం జరిగింది. 13 సంవత్సరాల వయస్సులో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ముమైత్ కెరీర్ మొదట్లో సినిమా ఫలితం గురించి పట్టించుకోకుండా పని చేశానని.. తాను ఇప్పుడు స్టార్ డ్యాన్సర్ అయినా తనలో ఏ మాత్రం గర్వం లేదని తెలిపారు.
బాల్యంలో టీవీ చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఏబీసీడీ మూవీ దర్శకుడు రెమో తన గురువు అని ఆమె వెల్లడించారు. తన తొలి సంపాదన 750 రూపాయలు అని.. కేవలం ఆరు నెలలలో ముందువరసలో నిలబడే స్థానం సంపాదించుకున్నానని ముమైత్ ఖాన్ చెప్పడం గమనార్హం. తాను ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తనకు స్నేహితులు, శత్రువులు లేరని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చారు.