Darshan, Prabhas: స్టార్ హీరో దర్శన్.. కి ప్రభాస్ సినిమాలకి ఉన్న ఈ లింక్ గమనించారా?

గతేడాది చివర్లో ప్రభాస్ (Prabhas) నటించిన ‘సలార్’ (Salaar) (సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్) రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. అయితే ఆ సినిమా వచ్చిన వారం రోజులకి అంటే డిసెంబర్ 29న కన్నడంలో ‘కాటేరా’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. దర్శన్ అందులో హీరో. ‘ ‘సలార్’ అనే పాన్ ఇండియా సినిమా వస్తుంది కదా? థియేటర్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది..

అది పోటీగా ఫీలవుతున్నారా?’ అని ‘కాటేరా’ ప్రమోషన్స్ లో దర్శన్ ని (Darshan) మీడియా ప్రశ్నిస్తే. అతను చాలా ఆరొగెంట్..గా సమాధానం ఇచ్చాడు. ‘మా సినిమా వస్తుంది అంటే పక్క భాషల సినిమాలు భయపడాలి. ఇది మా జనాల కోసం, థియేటర్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా’ అంటూ అతను సమాధానం ఇచ్చాడు. దీంతో దర్శన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ‘సలార్’ టైంలో దర్శన్ కూడా ఓ ట్రెండింగ్ టాపిక్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి 2898 ad ‘(Kalki 2898 AD)  రిలీజ్ అవుతుంది.

ఇప్పుడు కూడా దర్శన్ ట్రెండింగ్లో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. రేణుకస్వామి హత్య కేసులో ఇతను జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. రేణుకస్వామి హత్యకు గురైన టైంలో తీసిన ఫోటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.అభిమాని అని చూడకుండా దర్శన్ తన అనుచరులతో చాలా దారుణంగా రేణుక స్వామిని హత్య చేయించాడు. దీంతో దర్శన్ పై యూనానిమస్ గా ట్రోలింగ్ జరుగుతుంది. ఏదేమైనా ప్రభాస్ సినిమాలు వచ్చిన టైంలో దర్శన్ ట్రెండింగ్లో ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus