Balakrishna, Yash: ‘నిప్పురవ్వ’ కి ‘కె.జి.ఎఫ్’ కి ఉన్న పోలికలు గమనించారా?

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. పార్ట్ 1 కి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉండడంతో పెద్ద ఎత్తున ఈ మూవీని చూడడానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. సినిమా విడుదలై 10 రోజులు దాటినా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. కన్నడ తో పాటు అన్ని రాష్ట్రాల్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా పరుగును కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ హిట్ అయినప్పుడు ఆ మూవీ గురించి తెలుగులో పెద్ద ఎత్తున చర్చలు జరిగింది ఏమీ లేదు.

Click Here To Watch NOW

కానీ చాప్టర్ 2 హిట్ అయ్యాక ఇది కొత్త కథ కాదని గతంలో ఇలాంటి నేపథ్యం కలిగిన కథలు చాలానే వచ్చాయనే డిస్కషన్లు ఎక్కువయ్యాయి. మొన్నటి వరకు ఈ చిత్రం కథ చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ కి దగ్గర పోలికలు ఉన్నాయి అంటూ డిస్కషన్లు జరిగాయి. ఇప్పుడు బాలయ్య సినిమాతో పోలుస్తూ జరుగుతున్నాయి. 1993 వ సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నిప్పురవ్వ’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో బాలకృష్ణ.. సూర్యం పాత్రలో నటించాడు.

‘కె.జి.ఎఫ్’ లో బంగారు గనులు అయితే, ‘నిప్పురవ్వ’ లో బొగ్గు గనుల తవ్వకాలు ఉంటాయి. ఈ మూవీలో కూడా కార్మికుల్ని పీడించుకు తినే జనాలు ఉంటారు. ఓ యాక్సిడెంట్ లో కొంతమంది కార్మికులు చనిపోతే మిగిలిన వాళ్ళను బాలయ్య కాపాడతాడు… అలాగే చనిపోయిన వాళ్ళకు అండగా నిలబడి వారి కుటుంబీకులకు న్యాయం జరగాలని.. వాళ్ళ తరుపున పోరాడతాడు. ఇందులో కూడా బొగ్గు గనుల్లో ఫైట్ లు వంటివి ఉంటాయి.

విజయశాంతి, బాలకృష్ణ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే చాలా సార్లు ఈ చిత్రం షూటింగ్ ఆగిపోతూ వచ్చింది. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం విడుదల రోజున బాలకృష్ణ నటించిన మరో సినిమా ‘బంగారు బుల్లోడు’ కూడా రిలీజ్ అయ్యింది. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ‘నిప్పురవ్వ’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. కానీ రాఖీ బాయ్ లాంటి పాత్ర 30 ఏళ్ల క్రితమే ‘నిప్పురవ్వ’ లో బాలయ్య చేయడం జరిగిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus