అజ్ఞాతవాసి, జై సింహ మధ్య తేడాలివే

  • January 18, 2018 / 06:13 AM IST

ఖైదీ నంబర్ 150 రూపంలో చిరంజీవి విజయంతో ప్రారంభించారు. ఈ ఏడాది అన్నకంటే మించి తమ్ముడు అజ్ఞాతవాసి తో సూప్ హిట్ తో ప్రారంభిస్తారనుకుంటే అంతా తలకిందులైంది. ఇక సంక్రాంతి మొనగాడిగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ గత ఏడాది గౌతమి పుత్ర శాతకర్ణి తో హిట్ అందుకోగా ఈ సంవత్సరం జై సింహ గా వచ్చి అలరించారు. కలక్షన్స్ పరంగా అజ్ఞాతవాసి కంటే జై సింహా తక్కువగా ఉన్నప్పటికీ.. జై సింహా విజయవంతమైన చిత్రాల్లో చేరిపోయింది. ఎందుకంటే అజ్ఞాతవాసి పై భారీ అంచనాలు ఉండేవి. అందుకే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు 26 కోట్లను వసూలు చేయగలిగింది. మిశ్రమ స్పందన రావడంతో రెండో రోజు సగానికి కంటే తక్కువగా కలక్షన్స్ వచ్చాయి. అదే జై సింహా విషయంలో ఇది రివర్స్ అయింది.

ఈ సినిమాపై సాదాహరణమైన టాక్ ఉండడంతో తొలి రోజు 8 కోట్ల మాత్రమే షేర్ రాబట్టగలిగింది. ఇక రెండో రోజు కలక్షన్స్ లో పెద్ద తగ్గుదల కనిపించలేదు. 8 కోట్లకు దగ్గర్లోనే రాబట్టింది. ఇక సంక్రాంతి రోజు కలక్షన్స్ పెరిగాయి. అజ్ఞాతవాసి కలక్షన్స్ తగ్గడమే కానీ పుంజుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే… అజ్ఞాతవాసి టీజర్ చూసి అభిమానులు ఎంతో ఊహించున్నారు. సినిమా ఆ అంచనాలకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. జై సింహ అయితే టీజర్, ట్రైలర్ అప్పుడు అభిమానులు ఎలా ఊహించుకున్నారో.. సినిమా అలానే ఉంది. డిజప్పాయింట్ లేదు. మాస్ ప్రేక్షకులకు.. బాలయ్య అభిమానులకు నచ్చే అంశాలు ఇందులో నిండుగా ఉన్నాయి. అజ్ఞాతవాసి ఫ్యాన్స్ కి కూడా తలనొప్పి తెచ్చి పెట్టింది. సంక్రాంతికి జై సింహని బీట్ చేసే సినిమా రాకపోవడంతో స్టడీగా కలక్షన్స్ రాడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus