చర్యకు ప్రతి చర్య అనేది కామన్…అది నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా. ఒకరి నష్టం జరుగుతుంది అంటే దానర్థం ఇంకెవరికో లాభం కలుగుతుందని. చివరికి కరోనా వలన కలిగే నష్టానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా థియేటర్స్, షాపింగ్ మాల్స్ మూసివేయబడ్డాయి. అలాగే చాల చోట్ల విద్యా సంస్థలకు కూడా బంధ్ ప్రకటించడం జరిగింది. బయటికి రావడానికి భయపడుతున్న మనుషులకు వినోద సాధనం లేకుండా పోయింది.
ఈ పరిస్థితి ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ కి అనుకూలంగా మారడంతో కాసుల వర్షం కురుస్తుందని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తికి బయపడి ప్రజలు ఇండ్లలో నుండి బయటికి రాని పరిస్థితి నెలకొనివుంది. ఈ తరుణంలో వారు వినోదం కొరకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ గా ఉన్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్, సన్ నెక్స్ట్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారని తెలుస్తుంది. కరోనా ఎఫెక్ట్ మొదలైనప్పటి నుండి వీటికి ఆదరణ పెరిగిందని సమాచారం. ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ చందాదారుల సంఖ్య పెరుగుతున్నట్లు వినికిడి. కరోనా వైరస్ ప్రభావం మరికొన్నాళ్లు ఉండేలా కనిపిస్తున్న తరుణంలో వీరికి మరింత ఆదరణ పెరిగే అవకాశం కలదు. ఇలా ప్రాణాంతక వైరస్ ఓ టి టి ప్లాట్ ఫామ్స్ కి మంచి చేకూర్చింది. ఈ కొద్దిరోజులలో వీటికి అలవాటైన ప్రేక్షకులు సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం కలదు.