Dil Raju: ‘వారసుడు’ ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!

ఇళయ దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తాను నిర్మించిన ‘వారసుడు’ సినిమా.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలకు ఏమాత్రం పోటీ కాదని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.. ‘వారసుడు’ రిలీజ్ డేట్ మార్పు గురించి కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. కొన్ని పరిస్థితుల వల్ల జనవరి 11న విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నట్టు.. ఆ వివరాలను వెల్లడించడానికి దిల్ రాజు ప్రెస్‌మీట్ నిర్వహించారు..

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య ‘వారసుడు’ రిలీజ్ డేట్ విషయంలో మేం ఏం మాట్లాడుకున్నా.. వెంటనే బయటికి లీక్ అయిపోతుంది.. నాలుగు రోజులుగా ఇండస్ట్రీలో ‘వారసుడు’ గురించే డిస్కషన్ నడుస్తోంది.. సంక్రాంతికి మా ‘వారసుడు’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం.. తమిళ్‌లో జనవరి 11న రిలీజ్ అవుతుంది.. కానీ, తెలుగులో ఆల్రెడీ పెద్ద హీరోల సినిమాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు ఉండటంతో.. రెండు రోజులు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం..

ఈ విషయం గురించి ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలతో డిస్కస్ చేశాం.. దీంట్లో ఒక అడుగు వెనక్కి వేశాననే బాధ లేదు.. ‘వారసుడు’పై నాకు 100 శాతం నమ్మకం ఉంది..సూపర్ హిట్ కొట్టబోతున్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసినా ప్రాబ్లమ్ లేదు.. మంచి సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారనే నమ్మకం ఉంది.. ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి థియేటర్స్ ఇష్యూ అని.. దిల్ రాజుని ఎప్పుడు టార్గెట్ చేస్తూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.. నేను కూడా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాను..

నా సినిమా బాలయ్య, చిరంజీవిలకు పోటీకాదు. ఇది పక్కా.. దిల్ రాజు నుండి వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’, ‘శతమానం భవతి’ లాగే ఇదీ అలరిస్తుంది.. కాబట్టి నేను ఒక పాజిటివ్ ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాం.. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు ఎప్పుడూ అందరూ నామీద పడి ఏడుస్తుంటారు.. పర్లేదు అన్నీ పాజిటివ్‌గానే తీసుకుంటాను.. ఈ సినిమాలో ఏముంది అంటే.. ఫ్యామిలీ మూవీ అయినా.. కొత్త పాయింట్ ఉంటుంది.. అందరినీ అలరిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus