Dil Raju: దిల్ రాజు కామెంట్ల వెనుక అర్థం ఇదేనా!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించినపాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ క్రమంలోనే జనవరి 7 విడుదలవుతుందని పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేసిన కరోనా కారణం వల్ల ఆగిపోయింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 18 లేదా ఏప్రిల్ 28 వ తేదీలలో విడుదల చేయనున్నట్లు నిర్మాత డి.వి.వి.దానయ్య అధికారికంగా ప్రకటించారు.ఈ విధంగా ఈ సినిమా విడుదల తేదీలు రెండు ప్రకటించడంతో ఆ తేదీలలో విడుదల కావాల్సిన సినిమాలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ రెండు తేదీలలో విడుదల కావాల్సిన సినిమాలు మరోసారి వాయిదా వేసుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇకపోతే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాని ఏప్రిల్ 28 వ తేదీ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇదే తేదీకి రాజమౌళి సినిమా రావడంతో మరోసారి దిల్ రాజు తన సినిమాని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. అలాంటి సినిమాకు తప్పకుండా సరైన గౌరవం దక్కాలి. ఈ సినిమా మార్చి 18 విడుదల కాకుండా ఏప్రిల్ 28 వ తేదీ విడుదల అయితే అదే తేదీకి విడుదలవుతున్న మా సినిమా విడుదల వాయిదా వేసుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని దిల్ రాజు తెలిపారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus