దిల్‌రాజుకు రియ‌ల్ సినిమా చూపిస్తున్న వ‌కీల్ సాబ్‌..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం వ‌కీల్ సాబ్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నుండి వ‌చ్చిన సెన్షేష‌న్.. పింక్ మూవీ రీమేక్‌గా వ‌కీల్ సాబ్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండ‌గా, బోనీ క‌పూర్ అండ్ దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండ‌గా, శ్రుతి హాస‌న్ ముచ్చ‌ట‌గా మూడోసారి ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తోంది.

ఇక కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ‌గా, ఇటీవ‌ల తిరిగి ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మైంది. దీంతో త్వ‌ర త్వ‌ర‌గా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి, సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ద‌ర్శ‌క, నిర్మాత‌లు ప్లాన్ చేసుకున్నారు. అయితే చిత్ర యూనిట్ అనుకున్న ప్లాన్ రివ‌ర్స్ అయ్యింద‌ని స‌మాక‌చారం. దీంతో సంక్రాంతికి రెండు నెలలు మాత్ర‌మే స‌మ‌యం ఉన్నందున‌, షూటింగ్ పార్ట్, ఆ త‌ర్వాత నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలకు టైమ్ స‌రిపోద‌ని వ‌కీల్ సాబ్ చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌. ‌

అంతే కాకుండా షూటింగ్ వెంట‌నే పూర్తి చేద్దామ‌నుకున్నా, ప‌వ‌న్ ఎప్పుడు రాజ‌కీయాల్లో ఉంటాడో, ఎప్పుడు షూటింగ్‌కు వ‌స్తాడో అనేది అర్ధం కావ‌డంలేదంట‌. అంతే కాకుండా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య‌ నిహారిక పెళ్లి కూడా ఉంది. అన్ని కూతురు పెళ్లి కావ‌డంతో, ప‌వ‌న్ షూటింగ్‌కు వ‌చ్చే చాన్స్ లేదు. దీంతో చిత్ర యూనిట్ కాస్త అయోమ‌యానికి గుర‌వుతుండ‌గా, దిల్ రాజుకు మాత్రం చుక్కలు క‌న‌ప‌డుతున్నాయ‌ట‌. ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డం దిల్ రాజు క‌ల‌. అనుకోకుండా పింక్ రీమేక్‌తో ఆ చాన్స్ రావ‌డంతో ఎంతో సంబ‌ర‌పడ్డాడు దిల్ రాజు.

అయితే ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు పాలిటిక్స్ కూడా కీల‌కం కావ‌డంతో, ఆయ‌న రాజ‌కీయాలు చూసుకుని షూటింగ్‌కు వ‌చ్చేందుకు, ఏకంగా చార్టెడ్ ఫ్టైట్ కూడా అరెంజ్ చేశాడు. అయితే ఎంత ప్ర‌యాస ప‌డినా షూటింగ్ ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డంతో, దిల్ రాజుకు ఏం చేయాలో అర్ధం కాక త‌ల‌ప‌ట్టుకున్నాడ‌ని స‌మాచారం. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌కీల్ సాబ్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌కుండా కామ్‌గా ఉన్నాడు దిల్ రాజు. మ‌రి ప‌వ‌న్ త‌న ప‌నులు చ‌క్క‌బెట్టుకుని, ఈ సినిమాకు సంబంధించి మిగిలిన షూటింగ్ పార్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో, ఆ త‌ర్వాత ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి.. రిలీజ్ డేట్ ఎప్పుడు ప్ర‌క‌టించాలి అనే టెన్ష‌న్‌తో దిల్ రాజుకు రియ‌ల్‌గానే సినిమా క‌న‌ప‌డుతోంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus