Dil Raju: పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత దిల్ రాజు!

ఈ మధ్య కాలంలో దాదాపు బడా నిర్మాణ సంస్థలు అన్నీ పాన్ ఇండియా సినిమాల నిర్మాణంలో తలమునకలు అయి ఉన్నాయి. అలా దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా తెలుగు సహా అనేక భాషలకు చెందిన నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ లీక్ అయింది.

వాస్తవానికి అది ఈ గేమ్ ఛేంజర్ సాంగ్ అని కూడా జనానికి తెలియదు. థమన్ కొట్టిన మ్యూజిక్ అని అర్ధం అయింది దీంతో గుంటూరికారం లేదా గేమ్ ఛేంజర్ సినిమాది అనుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సాంగ్ లీక్ కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. ‘జరగండి జరగండి’ అంటూ సాంగ్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఫోక్ స్టైల్ లో ఉన్న సాంగ్ కి థమన్ ఇచ్చిన మ్యూజిక్, దారుణంగా ఉన్న లిరిక్స్ మీద ట్రోలింగ్ జరుగుతోంది.

ఈ సాంగ్ పై ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో (Dil Raju) దిల్ రాజు టీమ్ రంగంలోకి దిగింది. ఈ చర్యల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటించింది. మా సినిమా గేమ్ఛేంజర్లోని సాంగ్ లీక్ చేసిన వ్యక్తులపై IPC 66(C) కింద క్రిమినల్ కేసు నమోదు చేయబడింది . చట్టవిరుద్ధంగా లీక్ చేయబడిన నాసిరకం నాణ్యత కంటెంట్ను వ్యాప్తి చేయకుండా ఉండమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ సోషల్ మీడియా వేదికగా కోరింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus