Dil Raju, Venu Sriram: ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ కు అదొక అడ్వాంటేజ్..!

2011 లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు వేణు శ్రీరామ్. ఆ చిత్రం సో సోగా ఆడింది. ఆ చిత్రం సమయంలోనే వేణు శ్రీరామ్ ఇంత విషాదం చోటు చేసుకోవడంతో సినిమాలకి కొన్నాళ్ళు దూరమైనట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అటు తర్వాత రవితేజతో ఓ సినిమా అనౌన్స్ చేసినా అది సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ తర్వాత నానితో ‘ఎం.సి. ఎ’ చేసి హిట్టు కొట్టాడు. కానీ ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరో నాని మరియు నిర్మాత దిల్ రాజు అకౌంట్లో వెళ్లిపోయాయి.

అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ చేసి హిట్ కొట్టాడు వేణు శ్రీరామ్. 10 సినిమాలు చేసి హిట్లు కొడితే వచ్చే క్రేజ్ ను ఈ ఒక్క చిత్రంతో అతను సొంతం చేసుకున్నాడు. త్వరలో అల్లు అర్జున్ తో ఐకాన్ అనే మూవీని తెరకెక్కించడానికి కూడా రెడీ అయ్యాడు వేణు శ్రీరామ్. నిజానికి ఇది ఎప్పుడో అనౌన్స్ చేసిన ప్రాజెక్టే అన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇదిలా ఉండగా.. వేణు తెరకెక్కించిన మూడు సినిమాలు దిల్ రాజు బ్యానర్లో చేసినవే..!

అయితే ఒక్క క్యాస్టింగ్ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ వేణు.. దిల్ రాజు చెప్పిందే ఫైనల్ చేసేవాడట.కానీ ‘ఐకాన్’ విషయంలో వేణుకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు సమాచారం. వేణు శ్రీరామ్ మంచి క్యాస్టింగ్ ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. క్యాస్టింగ్ సెలక్షన్ విషయంలో వేణు సూపర్ అని హరీష్ శంకర్ వంటి దర్శకులు కూడా చెబుతుంటారు. సగం హిట్టు అక్కడే కొట్టేస్తాడు వేణు అని కూడా అతను చెప్పుకొస్తాడు. మరి ‘ఐకాన్’ క్యాస్టింగ్ విషయంలో ఇతనికి దిల్ రాజు.. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తే చెలరేగిపోవడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ టాక్. మరి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus