F3 Movie: ప్రేక్షకులకు దిల్ రాజు భారీ షాకిచ్చారా?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా విడుదలైతే ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఎఫ్3 సినిమా కథ, కథనంలో లోపాలున్నా ఎఫ్2 సినిమా స్థాయిలో ఈ సినిమా లేకపోయినా కొంతమందికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. ఎఫ్2 సినిమాకు, ఎఫ్3 సినిమాకు కథ, కథనం విషయంలో ఎలాంటి పోలికలు లేకపోవడం గమనార్హం.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ కొనుగోలు చేసింది. భారీ మొత్తం చెల్లించి సోనీ లివ్ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగులోని పాపులర్ ఓటీటీలైన అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆహా ఓటీటీలతో పోల్చి చూస్తే సోనీ లివ్ సబ్ స్క్రైబర్ల సంఖ్య చాలా తక్కువ కావడం గమనార్హం. పాపులర్ ఓటీటీలకు ఈ సినిమా హక్కులను విక్రయించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను మాత్రం జీ తెలుగు ఛానల్ కొనుగోలు చేసింది. ఎఫ్3 సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది. సమ్మర్ సెలవులను ఈ సినిమా కచ్చితంగా క్యాష్ చేసుకుంటుందని చెప్పవచ్చు. అందరు హీరోల రెఫరెన్స్ లను వాడేయటం కూడా ఈ సినిమాకు ఒకింత ప్లస్ అవుతోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తమ ఫేవరెట్ హీరోలను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారు.

సోన్ లివ్ కు డిజిటల్ హక్కులను విక్రయించి దిల్ రాజు ప్రేక్షకులకు ఒకింత భారీ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎఫ్3 సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. తక్కువ టార్గెట్ తోనే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు భారీ లాభాలను అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకుల ఆలోచనలకు, అంచనాలకు భిన్నంగా ఈ సినిమా కథ, కథనం ఉండటం గమనార్హం.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus