తెలుగు సినిమాల మధ్యలో ఓ తమిళ సినిమా వస్తే తప్పేంటి.. వాటిని కూడా జనాలు చూస్తారు కదా. ఈ మాట అనడానికి, వినడానికి బాగుంది. అయితే సంక్రాంతి సీజన్‌లో ఓ తమిళ సినిమా వచ్చి.. మంచి థియేటర్లు, పేరున్న థియేటర్లను తీసుకొని.. సాధారణ థియేటర్లను తెలుగు స్టార్ హీరోలకు ఇస్తే.. కోపమొస్తుందా రాదా? స్ట్రెయిట్ హీరోల అభిమానులకు అయితే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అంతెందుకు తెలుగు స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజుకు కూడా వస్తుంది. ఆ మాటకొస్తే ఆయన గతంలో ఓ సందర్భంలో ఈ విషయంలో విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో థియేటర్ల సమస్య బయటకు వచ్చింది కూడా. అది ఓకే.. దిల్ రాజు ఎందుకొచ్చారు మధ్యలోకి అంటున్నారా. ఇప్పుడు థియేటర్ల సమస్యకు ఆయన ఓ కారణం కావడమే. అందులోనూ తమిళ డబ్బింగ్ సినిమా.. మన సినిమాల మధ్యలోకి రావొద్దు అని గతంలో ఆయన అనడమే. ఎప్పుడో మూడేళ్ల క్రితం సంక్రాంతి సీజన్‌లో దిల్ రాజు ఈ మేరకు కామెంట్స్ చేశారు. ఆ వీడియోను ఇప్పుడు తవ్వి బయటకు తీశారు నెటిజన్లు.
ఇప్పుడెందుకు తీశారు అంటే.. 2023 సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో ఆయన డబ్బింగ్ చిత్రం ఒకటుంది కాబట్టి. తమిళంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘వరిసు’. తెలుగులో ‘వారసుడు’గ డబ్ అయ్య వస్తోంది. అయితే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ థియేటర్లలో ఆయన తన సినిమాను వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. విశాఖపట్నం ఏరియాలో ఈ తరహా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీంతో రజనీకాంత్ సినిమానే బయట సినిమా అంటూ అప్పుడు కామెంట్ చేసిన దిల్ రాజు.. ఇప్పుడు అదే సీజన్‌కి తన డబ్బింగ్ సినిమాను తీసుకురావడం, దాని కోసం థియేటర్లు బ్లాక్ చేస్తున్నరంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!