Jailer Movie: రజనీ కాంత్ బ్లాక్ బస్టర్ కొట్టారు : దిల్ రాజు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్‌’ సినిమా ఈరోజు అనగా ఆగస్టు 10 న రిలీజ్ అయ్యింది. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్‌’ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ‘ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ల పై దిల్ రాజు, సునీల్ నారంగ్ లు రిలీజ్ చేశారు. ఇక మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

రజినీకాంత్ చాలా ఏళ్ళ తర్వాత ఓ స్టైలిష్ యాక్షన్ సినిమాతో అలరించడానికి ముందుకు వచ్చారు. ఆయన ప్రయత్నానికి జనాలు నీరాజనాలు పట్టారు అని చెప్పొచ్చు. మొదటి రోజు సోలో రిలీజ్ దక్కడంతో ‘జైలర్’ అడ్వాన్స్ బుకింగ్స్ షో.. షోకి పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఎక్స్ట్రా స్క్రీన్స్, థియేటర్స్ యాడ్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకరైన దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “జైలర్ (Jailer) చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మేము, ఏషియన్ మల్టీప్లెక్స్ కలిసి విడుదల చేశాం.

అన్ని వైపుల నుండి ఈ చిత్రానికి సూపర్ టాక్ లభిస్తుంది. రజనీకాంత్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ పడిందని అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆంధ్రలో చాలా సెంటర్స్ లో మాట్నీ నుంచి అదనంగా థియేటర్స్, స్క్రీన్స్ పెంచడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus