Dil Raju, Prashanth Neel: అలాంటి కథతో ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కిస్తున్నారా?

టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు. తక్కువ సినిమాలతోనే ప్రశాంత్ నీల్ క్రేజ్ ను పెంచుకోగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సలార్ పార్ట్1 ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని సమాచారం. సలార్ పార్ట్2 వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాల తర్వాత దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా బయోపిక్ గా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బన్నీ లేదా చరణ్ హీరోగా నటించే అవకాశం ఉంది. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కే ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. వారసుడు ఫలితం నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూనే ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెలుగు హీరోలతో పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తాయేమో చూడాల్సి ఉంది. ఇతర దర్శకులకు భిన్నంగా యాక్షన్ సినిమాలకు ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus