Dil Raju: పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన దిల్ రాజు..?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. నగరాల్లో, పట్టణాల్లో వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వకీల్ సాబ్ సినిమా హిట్ కావడంతో దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో నటించడానికి యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారని సమాచారం. వకీల్ సాబ్ సినిమా టాక్, కలెక్షన్ల విషయంలో దిల్ రాజు సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి వకీల్ సాబ్ సినిమాను వీక్షించిన దిల్ రాజు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ మూవీకి రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారని..

వకీల్ సాబ్ పాత్రలో ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను ఆదరిస్తున్నారని దిల్ రాజు అన్నారు. తన డ్రీమ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ సరైన సినిమా తీశాడని దిల్ రాజు చెప్పారు. సినిమా చూస్తున్న ఫ్యాన్స్, ప్రేక్షకులకు పవన్ ఒక విజ్ఞప్తి చేశారని దిల్ రాజు వెల్లడించారు. కరోనా విజృంభణ వల్ల బయట పరిస్థితులు బాగా లేవని.. సినిమాకు వచ్చే సమయంలో మాస్క్ లు కచ్చితంగా పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారని దిల్ రాజు తెలిపారు.

త్వరలోనే పవన్ కళ్యాణ్ వచ్చే ఈవెంట్ ఒకటి హైదరాబాద్ లో నిర్వహించబోతున్నామని దిల్ రాజు పేర్కొన్నారు. వకీల్ సాబ్ మీట్ త్వరలోనే పెడుతున్నామంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దిల్ రాజు శుభవార్త చెప్పారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus