Dil Raju: దిల్ రాజు చెప్పిన లెక్కలు వింటే షాకవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా విడుదలైనా ఆ సినిమా కలెక్షన్ల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందంటే నిర్మాతకు ఊహించని స్థాయిలో లాభాలు మిగులుతాయని చాలామంది భావిస్తారు. అయితే సినిమాల కలెక్షన్లకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తే ఆ మొత్తంలో 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని దిల్ రాజు తెలిపారు.

మొత్తం 36 కోట్ల రూపాయలు జీఎస్టీ చెల్లించగా థియేటర్ రెంటల్స్ కింద 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నారై పద్ధతిలో సినిమాను రిలీజ్ చేస్తే మరో 25 కోట్ల రూపాయలు పోతాయని దిల్ రాజు వెల్లడించడం గమనార్హం. ఈ లెక్కలు విన్న ప్రేక్షకులు నిర్మాతకు మిగిలేది చాలా తక్కువ మొత్తమని చెబుతున్నారు. ఈ 85 కోట్ల రూపాయలలో కూడా లాభాలు వస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తనతో పాటు కెరీర్ ను మొదలుపెట్టిన తన స్నేహితులు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని స్థాయిలో సంపాదించుకున్నారని దిల్ రాజు వెల్లడించారు. సినిమా రంగంలో పేరు కోసమే కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తాను 50 సినిమాలను నిర్మించగా ఆ సినిమాలలో ఐదారు సినిమాలు మినహా మిగతా సినిమాలన్నీ మంచి లాభాలను అందించాయని దిల్ రాజు పేర్కొన్నారు. దిల్ రాజు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వారసుడు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నానని అయన చెప్పుకొచ్చారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో కూడా భారీగా క్రేజ్ ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus