తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఆయన నిర్మాణంలో వచ్చిన శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదే జోరును దిల్ రాజు రాజకీయాల్లోనూ కొనసాగించనున్నట్లు తెలిసింది. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున జహీరాబాద్ ఎంపీ గా పోటీ చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. స్వయంగా కేసీఆర్ దిల్ రాజ్‌కు ఈ సీటుని ఆఫర్ చేశారని సమాచారం. టీఆర్ఎస్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ఈ వార్త జోరుగా ప్రసారం సాగుతోంది. దీనికి కారణం రీసెంట్ గా నిజామాబాద్‌లో నిర్వహించిన ఫిదా సంబరాలేనని ఫిలిం నగర్ వాసులు స్పష్టం చేస్తున్నారు.
ఈ వేడుకలో సినీ నటీనటులకంటే ప్రజాప్రతినిధులు ఎక్కువగా పాల్గొన్నారని, టీఆర్‌ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, అర్బన్ ఎమ్మెల్యే బీగల గణేష్, మేయర్ ఆకుల సుజాతలు హడావుడి చేసారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఈ వేడుకలో దిల్ రాజు సినిమాల కంటే, అతని కుటుంబం అందించిన సేవలను పలువురు ప్రస్తావించడం కూడా అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.