దిల్ రాజు భార్య తేజస్విని ఇన్స్టా పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) అంటే తెలియని వారంటూ ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో ఈయన పట్టిందల్లా బంగారం అయ్యింది. ‘ఆర్య’ (Aarya) ‘బొమ్మరిల్లు’ (Bommarillu) ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) వంటి సూపర్ హిట్లతో ఫామ్లోకి వచ్చాక.. స్టార్ హీరోలతో ‘బృందావనం’ (Brindavanam) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దిల్ రాజు పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి తెరిచిన పుస్తకమే.

Tejaswini

ఈయన మొదటి భార్య అనిత.. 2017 లో అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకి హన్షిత అనే కుమార్తె ఉంది. తర్వాత కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటూ వచ్చిన దిల్ రాజు.. వైఘా రెడ్డి అలియాస్ తేజస్విని (Tejaswini ) అనే ఎయిర్ హోస్టెస్ ని వివాహం చేసుకున్నారు. వీరికి 2022లో ఓ బాబు జన్మించిన సంగతి తెలిసిందే. ఆ బాబు పేరు అన్వి రెడ్డి. అప్పుడప్పుడు ఇతనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇటీవల దిల్ రాజు ఫ్యామిలీ తిరుమలలో సందడి చేసినప్పుడు అన్వి రెడ్డి ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అందులో అతను చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. దిల్ రాజు భార్య తేజస్వి అభిమానులతో మరో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. అదేంటంటే ఇటీవల తేజస్విని ‘లా’ కంప్లీట్ చేసిందట. ఇది ఆమె తల్లి వల్లే సాధ్యమైందని తెలుపుతూ ఇన్స్టాలో చెప్పుకొచ్చింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

వరుణ్‌ దగ్గరకు ముందే ఆ రెండు హిట్‌ కథలు వచ్చాయట.. కానీ అలా మిస్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus