దిల్ రాజు జడ్జ్ మెంట్ మాత్రమే కాదు ఐడియాలజీ కూడా మారాలి!

స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న ఏకైక నిర్మాత దిల్ రాజు. హీరోహీరోయిన్లు లేదా దర్శకుల పేర్లు పోస్టర్ల మీద చూస్తూ సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు నిర్మాత టైటిల్ కార్డ్ చూసి థియేటర్ కి వచ్చేలా చేశాడు దిల్ రాజు. అందుకే ఆయన నిర్మాణంలో నటించేందుకు అగ్ర కథానాయకులు కూడా ఉవ్విళ్లూరారు. అలాంటి సూపర్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఈమధ్యకాలంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్నాడు. నిర్మాతగా మాత్రమే కాదు డిస్ట్రిబ్యూటర్ గానూ ఆయన ఈమధ్యకాలంలో చాలా దారుణంగా నష్టపోయాడు. ఈమధ్యకాలంలో ఆయన నిర్మాణంలో లేదా డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి.

దాంతో దిల్ రాజు ఇప్పుడు తన డెసిషన్ మేకింగ్ లో అప్డేట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని గ్రహించాడు. కానీ.. ఆ అప్డేట్ అయ్యే విధానంలోనే చాలా పెద్ద లూప్ హోల్స్ ఉన్నాయి. ఇవాళ ఒక సాంగ్ లాంచ్ కి ముఖ్య అతిధిగా హాజరైన దిల్ రాజు “ఈమధ్యకాలంలో ఆడియన్స్ లిప్ లాక్స్ & బొల్డ్ సీన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే నా సినిమాలు నచ్చడం లేదు. నేను కూడా నా సినిమాల విషయంలో మళ్ళీ ఆలోచించాలేమో” అని కామెంట్ చేశాడు దిల్ రాజు. అయితే.. ఇక్కడ ఆడియన్స్ బోల్డ్ కంటెంట్ ను మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు అని దిల్ రాజు కామెంట్ చేయడం పట్ల కొందరు ప్రేక్షకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్ రాజు సినిమాలు ఫెయిల్ అయ్యింది సినిమాలో కంటెంట్ బాలేక కానీ.. కిస్సింగ్ సీన్స్ లేక కాదు. ఈ విషయాన్ని దిల్ రాజు దృష్టిలో పెట్టుకొంటే మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus