Dilraju: వారసుడు పోస్ట్ పోన్ చేయడం వెనుక ఇంత కథ ఉందా?

వారసుడు చిత్రాన్ని ఎట్టకేలకు 3 రోజులు పోస్ట్ పోన్ చేశాడు దిల్ రాజు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు తన సినిమా పోటీ కాదు … నా కెపాసిటీ బట్టి నా సినిమాని కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసుకుంటున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే కొద్దిరోజుల క్రితం దిల్ రాజు వెర్షన్ కంప్లీట్ గా వేరుగా ఉండడంతో ఇది చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉండగా.. దిల్ రాజు వారసుడు చిత్రాన్ని మూడు రోజులు పోస్ట్ పోన్ చేయడం వల్ల వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలకు ఇంకో 100 ధియేటర్లు పెరుగుతాయి.

అయితే దిల్ రాజు వారసుడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసింది చిరు, బాలయ్య సినిమాల గురించి అనుకుంటే పొరపాటే.దీని వెనుక వేరే కారణం ఉంది అని ఇన్సైడ్ టాక్. అదేంటి అంటే.. అజిత్ నటించిన తునివు… తెలుగులో తెగింపు గా సంక్రాంతికే రిలీజ్ కాబోతుంది. జనవరి 11న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ మూవీని దిల్ రాజే రిలీజ్ చేస్తున్నాడట.అందువల్ల వారసుడు చిత్రాన్ని జనవరి 14 కి మార్చినట్టు తెలుస్తుంది.

సంక్రాంతి సీజన్ లో ఓ సినిమాకి ఒక్క రోజు సోలో రిలీజ్ దొరికినా ఎక్కువ ధియేటర్లు దొరుకుతాయి. పర్సంటేజ్ బేసిస్ పై పంపిణీ దారుడికి మ్యాగ్జిమం రికవర్ అయిపోతుంది. తెగింపు విషయంలో దిల్ రాజు ఆలోచన ఇదే అని తెలుస్తుంది. అందుకే ఆ సినిమాకి ప్రమోషన్ కూడా చేయడం లేదు అని వినికిడి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus