టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు జడ్జిమెంట్ పై అందరికీ నమ్మకం ఉంటుంది. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన 80 శాతం సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఏ సినిమా కెపాసిటీ ఎంత అనేది దిల్ రాజు చాలా వరకు కరెక్ట్ గా చెప్పేస్తూ ఉంటారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ఓ సినిమా హక్కులను కొనుగోలు చేశారు అంటే.. ఆ సినిమాపై హైప్ కూడా పెరుగుతుంది. ఇటీవల వచ్చిన ‘బింబిసార’ చిత్రం అందుకు పెద్ద ఉదాహరణ.
కళ్యాణ్ రామ్ సినిమాని ఒక్క నైజాం ఏరియాకు గాను రూ.5 కోట్లు భారీ మొత్తం పెట్టి తీసుకున్నాడు అంటే చాలా మంది.. ‘దిల్ రాజు ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాడేంటి’ అంటూ కామెంట్లు చేశారు. కానీ ‘బింబిసార’ మూవీ నైజాంలో రూ.11 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఆయనకు డబుల్ ప్రాఫిట్స్ అందించడంతో అంతా షాక్ అయ్యారు. అలా అని అన్ని వేళలా దిల్ రాజు జడ్జ్ చేసిన సినిమాలు సక్సెస్ అయ్యాయని చెప్పలేము.
ఒక్కోసారి ఆయన లెక్క కూడా తప్పుతుంటుంది. ఇటీవల ఆయన నిర్మాణంలో వచ్చిన ‘థాంక్యూ’ ని ఈ విషయంలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా మరేదో కాదు నవదీప్ హీరోగా నటించిన ‘జై’.2004 మార్చిలో రిలీజ్ అయిన ఈ మూవీ నైజాం హక్కులు దిల్ రాజు రూ.2.25 కోట్లు పెట్టి దక్కించుకున్నారట.
కానీ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. దిల్ రాజుకి రూ.2 కోట్ల వరకు నష్టం వచ్చిందట. సగం డబ్బులు కూడా వెనక్కి రాకపోవడంతో దిల్ రాజు షాక్ కు గురయ్యారట. అయితే మే 7న రిలీజ్ అయిన ‘ఆర్య’ మూవీ సూపర్ హిట్ అయ్యి దిల్ రాజుని నష్టాల భారి నుండి తప్పించిందట. లేదంటే బుక్కయిపోయేవాడినని దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.