Payal Rajput: హాట్ టాపిక్ గా మారిన అజయ్ భూపతి- పాయల్ … ల ‘మంగళవారం’ కాన్సెప్ట్ పోస్టర్

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో దర్శకుడిగా మారాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఈ సినిమాని అజయ్ ట్రీట్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది. ‘ఆర్.ఎక్స్.100’ కి మ్యూజిక్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గ్లామర్ బాగా ప్లస్ అయ్యాయి. హీరోయిన్ పాయల్ ఈ మూవీలో చాలా బోల్డ్ గా నటించింది.

ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్ కు ఆమె ఏమాత్రం వెనుకాడకుండా చేసింది. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రం 5 రెట్లు లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే అజయ్ తీసిన రెండో సినిమా ‘మహాసముద్రం’ దారుణంగా నిరాశపరిచింది. మొదటి చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ రెండో సినిమాకి హీరోని పట్టడానికి చాలా కష్టాలు పడ్డాడు దర్శకుడు అజయ్ భూపతి. అలాంటిది రెండో సినిమా ప్లాప్ ఇచ్చాక అవకాశాలు అంత ఈజీగా వస్తాయా. అందుకే తన మూడో సినిమాకు నిర్మాతగా కూడా అజయ్ మారాల్సి వచ్చింది.

‘మంగళవారం’ అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. నటీనటులు ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. కానీ ఈ సినిమాలో 30 పాత్రలు ఉంటాయి అని.. వేటికవే ప్రత్యేకమైనవని చెప్పారు. ఈ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇటీవల ఆమె ఈస్ట్ గోదావరిలో షూటింగ్ చేసి వచ్చింది.

ఆ టైంలో ‘మంగళవారం’ అనే సినిమాలో నటిస్తున్నట్టు తెలియజేసింది. పాయల్ నటిస్తుంది.. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ఈ సినిమాలో ఏ రేంజ్ ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటాయో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యింది అంటే అజయ్ భూపతికి.. పాయల్ సెంటిమెంట్ గా మారే అవకాశం ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus