NBK108: ఆ కంటి చూపు చూపుతోంది ఇది శాంపిల్ మాత్రమే!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నటి కాజల్ అగర్వాల్ అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇకపోతే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ విడుదల చేశారు.ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి నందమూరి అభిమానులను సంతోషానికి గురి చేసింది. నందమూరి నటసింహం రోరింగ్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఢిఫరెంట్ మేకోవర్ తో బాలయ్యను ప్రజెంట్ చేయబోతున్నట్టు ఫస్ట్ లుక్ తో తెలియజేశారు.

ఇలా ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. ఇక ఈ పోస్టర్ ను ఈయన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఆ కంటి చూపు చెబుతోంది గిది కేవలం శాంపిల్ మాత్రమే అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ పోస్టర్ ను అందరూ ఇంతలా ఆదరించి స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి అనిల్ రావిపూడి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలా ఈ సినిమాలో బాలయ్య లుక్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందోననే ఆత్రుత అభిమానులలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus