Anil Ravipudi: భగవంత్ కేసరికి సీక్వెల్ ఉందా.. అనిల్ రావిపూడి ఏమన్నారంటే?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమా ఫస్ట్ డే టికెట్ల కోసం ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది. భగవంత్ కేసరి మూవీ సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి స్పందిస్తూ ప్రస్తుతానికి అయితే సీక్వెల్ దిశగా ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని అన్నారు. ఈ సినిమా పార్ట్2 గురించి ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేదానిని బట్టి ముందుకు వెళతానని ఆయన తెలిపారు.

ప్రేక్షకుల ఇష్టాలను అనుగుణంగా సినిమాలు తీస్తానని అనిల్ రావిపూడి వెల్లడించారు. అర్జున్ రాంపాల్ బాలయ్యకు ఎదురుగా నిలబడే పాత్రలో చేశారని అర్జున్ రాంపాల్ వాయిస్, ప్రజెన్స్ ఎంతో బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ డబ్బింగ్ కూడా వినవచ్చని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్స్ లో పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.

బాలయ్య అనిల్ రావిపూడి (Anil Ravipudi) మధ్య ఈ సినిమాతో మంచి బంధం ఏర్పడిందని ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సమాచారం అందుతోంది. వరుసగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న అనిల్ రావిపూడి తర్వాత సినిమాలతో సైతం విజయ పరంపర కొనసాగిస్తానని నమ్మకంతో ఉన్నారు. భగవంత్ కేసరి సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.

కాజల్, శ్రీలీల పాత్రలు స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. థమన్, శ్రీలీలలకు ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనిల్ రావిపూడి తన మార్కెటింగ్ స్ట్రాటజీలతో ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus