Polimera 3: కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ‘పొలిమేర’ దర్శకుడు!

కోవిడ్ టైంలో ‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera) అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా .. అందరికీ కొత్త ఫీల్ ఇచ్చింది. సత్యం రాజేష్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), బాలాదిత్య (Baladitya), గెటప్ శీను (Getup Srinu) వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి రెండో భాగంగా ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2)  వచ్చింది. 2023 చివర్లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా.

Polimera 3

రూ.4 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్ల (షేర్) ని కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే దీనికి 3వ భాగం కూడా ఉంటుందని ప్రకటించారు. దానిని ‘గీతా ఆర్ట్స్’ వారు నిర్మించనున్నట్టు ప్రకటన వచ్చింది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఇది ఉండబోతున్నట్లు కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయిందేమో అనే టాక్ కూడా నడుస్తోంది.

ఎందుకంటే ‘పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) ’12A రైల్వే కాలనీ’ అనే సినిమా చేస్తున్నాడు.అతను దీనికి దర్శకుడు కాదట. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ షో రన్నర్ అట. ఒక్క డైరెక్షన్ మాత్రం నాని కాసరగడ్డ చేస్తున్నాడు. భీమ్స్ (Bheems Ceciroleo) సంగీత దర్శకుడు. తాజాగా టీజర్ వదిలారు. ఇది కూడా ‘పొలిమేర’ స్టైల్లోనే ఆత్మలు, క్షుద్రపూజలు.. థీమ్ తో ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. టీజర్ అయితే బాగుంది. కానీ ‘పొలిమేర 3’ (Polimera 3) ఉండదేమో అనే అనుమానాలు కూడా రేకెత్తించింది ఈ టీజర్.

హారర్ జోనర్ తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అక్కినేని హీరో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus