Hero Ram: రామ్‌ కోసం అనుదీప్‌ కథ రాస్తున్నారా..!

సినిమా హిట్‌ కాకపోయినా ఓ దర్శకుడికి వెంటనే సినిమా అవకాశం వచ్చింది అంటే.. ఈ రోజుల్లో గ్రేట్‌ అనే చెప్పుకోవాలి. అలాంటి గ్రేట్‌ ఆపర్చునిటీ అందుకుంటున్న దర్శకుడు కేవీ అనుదీప్. ‘జాతిరత్నాలు’తో డిఫరెంట్‌ కామెడీ సినిమా అందించిన అనుదీప్‌.. తర్వాతి ప్రయత్నంగా ‘ప్రిన్స్‌’ అనే తమిళ సినిమా చేశాడు. ఆ సినిమా అదే పేరుతో తెలుగులోకి వచ్చి ‘జాతిరత్నాలు రివైజ్డ్‌’ అనిపించుకుంది. కానీ ఫలితం మాత్రం ఆ స్థాయిలో కాదు, ఏ స్థాయిలోనూ రాలేదు.

తెలుగు ప్రేక్షకులు ‘ఇలాంటి కొత్త సినిమాలు గతంలో చాలా వచ్చాయి. ఇలా కొత్తగా లేకపోవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే ఆ సినిమా తర్వాత అనుదీప్‌ పూర్తిగా డౌన్‌ ఏమీ అవ్వలేదట. కారణం ఆ సినిమా ఫలితం బాగా లేకపోయినా.. ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా చేయడానికి రంగం సిద్ధమవుతోంది అని అంటున్నారు. ఈ సినిమాలో హీరోగా రామ్‌ నటిస్తాడు అనే మాట కూడా టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

‘పిట్టగోడ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు అనుదీప్. ఆ సినిమా ఫలితం తేడా కొట్టడంతో కొంత గ్యాప్ తీసుకుని ‘జాతిరత్నాలు ’అంటూ బ్లాక్ బస్టర్ సినిమా చేశాడు. ఆ సినిమా ఫలితంతో శివకార్తికేయన్ వంటి తమిళ స్టార్ హీరోతో పనిచేసే అవకాశం సంపాదించాడు. అదే ‘ప్రిన్స్’. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో లేకపోయినా… అనుదీప్ మార్క్ కామెడీ మాత్రం భలేగా ఉంది అని మార్కులు పడ్డాయి. ఇప్పుడు అదే కామెడీతో రామ్‌ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారట.

వరుసగా మాస్‌ మసాలా, యాక్షన్‌ సినిమాలు చేస్తున్న రామ్‌.. తన తర్వాతి సినిమా కామెడీతో నిండిపోవాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో అనుదీప్‌ మీద రామ్‌ దృష్టి పడిందట. త్వరలోనే ఈ సినిమా సంగతులు అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్‌.. బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ సినిమానే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. అయితే అనుదీప్‌.. మూడు పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ల దగ్గర అడ్వాన్స్‌ తీసుకున్నారట. మరి ఎవరితో ఈ సినిమా ఉంటుందో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus