బుచ్చిబాబు చెప్పే స్టోరీకి తారక్ ఫిదా అవుతాడా..?

మెగా ఫ్యామిలీ కుర్రాడు వైష్ణవ్ తేజ్ ని వెండితెరపై మాస్ ఇమేజ్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పుడు తన తర్వాత ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నాడా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. ఇంతకీ మేటర్ ఏంటంటే, ఉప్పెన సినిమా రిలీజ్ అవ్వకముందే భారీ ఆఫర్లని తెచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో సపరేట్ టాక్ ని కూడా తెచ్చుకుంటోంది. అంతేకాదు, ఇప్పటికే మ్యూజిక్ పరంగా సినిమా సూపర్ హిట్ అయిపోయింది కూడా.

ఇక ఫిబ్రవరి 12వ తేదిన ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు. సినిమా టాక్ పరంగా ఎలా ఉన్నా కూడా డైరెక్టర్ గా మాత్రం బుచ్చిబాబుకి మంచి పేరు వచ్చేసింది. అలాగే, ఇందులో హీరోయిన్ కృతి శెట్టికి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక సినిమా రిలీజై సూపర్ హిట్ అయితే మాత్రం ఇండస్ట్రీలో వీళ్లకి తిరుగు ఉండదనే అంటున్నారు అందరూ. ఈలోగా బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఒక స్టోరీ లైన్ ప్రిపేర్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఒక యాక్షన్ మూవీని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ ని కలిసి స్టోరీ లైన్ వినిపించబోతున్నాడని, ఉప్పెన సినిమా రిలిజైన వెంటనే ఈ కథని తారక్ కి కలిసి చెప్తాడని అంటున్నారు. బుచ్చిబాబు సన్నిహిత వర్గాల నుంచి ఈ సమాచారం తెలుస్తోంది. మరి బుచ్చిబాబు స్టోరీకి తారక్ ఫిదా అవుతాడా..? ఒకవేళ స్టోరీ లైన్ నచ్చితే, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో ఎన్టీఆర్ డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus