యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఇటీవలే ‘దస్ కా దమ్కీ’ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది విశ్వక్ సేన్ నుంచి వచ్చిన ‘పాగల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నరేష్ కుప్పిలినే ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. ‘పాగల్’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. నరేష్ కి విశ్వక్ సేన్ తో మరో సినిమా ఛాన్స్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. బుధవారం నాడు ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
కానీ డైరెక్టర్ గా నరేష్ పేరు లేదు. స్వయంగా విశ్వక్ సేన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ముందు అనౌన్స్మెంట్ చేసినప్పుడు నరేష్ కుప్పిలిని దర్శకుడిగా ప్రకటించి.. ఇప్పుడేమో విశ్వక్ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నాడు. ఏం జరిగిందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే విశ్వక్ సేన్ కి దర్శకత్వం అయితే కొత్త కాదు. అతను ఇంతకముందు ‘ఫలక్‌నుమా దాస్’ అనే సినిమా తీశాడు. అది మలయాళ సినిమా ‘అంగామలై డైరీస్’కు రీమేక్. దాన్ని హైదరాబాద్ నేపథ్యంలో విశ్వక్ సేన్ బాగానే తీశాడు.
ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. మరి ఈసారి కూడా వేరే భాష సినిమాను రీమేక్ చేస్తున్నాడా..? లేక సొంత కథతోనే సినిమా తీస్తున్నాడా..? అనేది చూడాలి. ఇక దర్శకుడు నరేష్ రూపొందించిన ‘పాగల్’ సినిమా ఫ్లాప్ అవ్వడం.. ఇప్పుడు రెండో సినిమాను నుంచి అతడిని తప్పించడం అతడి కెరీర్ పై ఎఫెక్ట్ చూపించడం ఖాయం. ఇక విశ్వక్ సేన్ విషయానికొస్తే.. అతడు నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో.. ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!