సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 21 న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ డీసెంట్ షేర్స్ ను రాబడుతుంది. ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గత వీకెండ్ ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పాలి.
‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రాన్ని కార్తీక్ దండు డైరెక్ట్ చేశాడు. అయితే సుకుమార్ స్క్రీన్ ప్లే ని అందించడం జరిగింది. అయితే కార్తీక్ దండు అనుకున్న కథకి సుకుమార్ చాలా మార్పులు చేసాడట. ఈ విషయాన్ని అతనే చెప్పాడు.ఈ చిత్రంలో శ్యామల .. పార్వతి అనే పాత్రలో నటించింది. ఈమె హీరోకి అక్క లాంటి పాత్రను పోషించింది. చెవిపోటుతో బాధపడుతూ.. ఓసారి అనుమానాస్పదంగా ఈ పాత్ర చనిపోతుంది. అయితే చివర్లో హీరోయిన్ సంయుక్త మీనన్ విలన్ అన్నట్టు చూపించారు.
కానీ మొదట శ్యామల పాత్రనే విలన్ గా అనుకున్నాడట దర్శకుడు కార్తీక్. ఇటీవల ఈ విషయాన్ని రివీల్ చేశాడు. అయితే సినిమా సూపర్ హిట్ అయినందుకు అతను ఈ విషయాన్ని ఆనందపడుతూ చెప్పాడా లేక.. తాను అనుకున్న కథ మారిపోయింది అని బాధపడుతూ చెప్పాడా..? అన్న విషయం మాత్రం క్లారిటీ లేదు.గతంలో ‘భీమ్లా నాయక్’ సినిమాకి స్క్రీన్ ప్లే ని అందించిన త్రివిక్రమ్ సైతం తనకు నచ్చినట్టు కథని మార్చేశాడు.
యంగ్ డైరెక్టర్స్ కాబట్టి.. సీనియర్ డైరెక్టర్లు చెప్పినట్లు చేయక తప్పదు. అయిష్టంగా అయినా చేయాల్సిందే. మరోపక్క కార్తీక్ దండు కు నెక్స్ట్ మూవీ సెట్ అవ్వలేదు. కానీ రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి.. ఇతనితో వర్క్ చేయడానికి చాలా మంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.