Venkatesh: వెంకీ కొత్త ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఎఫ్3’ సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను నవ్వించలేకపోయింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వెంకీ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ‘ఓరి దేవుడా’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు వెంకీ.

ఇది తమిళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను తెలుగులో వెంకీ పోషిస్తున్నారు. దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు వెంకీ. ఇప్పుడు మరో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి హిట్టు సినిమాలు తీసిన శివ నిర్వాణ.. చివరిగా ‘టక్ జగదీష్’ సినిమాను డైరెక్ట్ చేశారు.

ఈ సినిమా రిజల్ట్ బోల్తా కొట్టింది. దీంతో విజయ్ దేవరకొండని ఒప్పించి ‘ఖుషీ’ అనే సినిమాను మొదలుపెట్టారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత వెంకీని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు శివ నిర్వాణ. ఇప్పటికే వెంకీకి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పారట.

స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశారట. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. రీసెంట్ గానే ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ ను పూర్తి చేశారు వెంకీ. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus