Gautham Menon: అవే నా సినిమాలలో చూపిస్తాను!

ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ (Gautham Menon) ఒకరు. ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించే సందడి చేశారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి డైరెక్టర్ గౌతమ్ మీనన్ తాజాగా గీతం విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా ఇండస్ట్రీ గురించి పలు విషయాలను తెలియచేశారు. రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయం రివైండ్ ది మిలీనియం ఇతి వృత్తంతో సోమవారం నిర్వహించిన టెడ్ ఎక్స్ కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి రావడానికి డైరెక్టర్ మణిరత్నం ఇన్స్పిరేషన్ అని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తాను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలియజేశారు. మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన నాయక్ సినిమా తాను ఇండస్ట్రీలోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఏదైతే అనుకుంటానో దానిని అలాగే తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను సినిమాగా తీస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

కష్టపడకుండా ఏదీ రాదని దేనినైనా సాధించాలి అంటే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని తెలియజేశారు. గౌతమ్ మీనన్ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం దర్శకుడుగా మాత్రమే కాకుండా సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తుంటారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus