చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న మాస్ హీరో రవితేజ ఎట్టకేలకు ‘క్రాక్’ సినిమా హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఊహించిన దానికంటే భారీ విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోయింది. దీంతో యూనిట్ మొత్తం సంతోషంగా ఉంది. కానీ దర్శకుడు మాత్రం హ్యాపీగా లేడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయనకు రావాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదట.
మరో పాతిక, ముప్పై లక్షలు రావాల్సి ఉండగా.. నిర్మాత మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయం ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పంచాయితీ వరకు వెళ్లిందని తెలుస్తోంది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన రెమ్యునరేషన్ రాలేదని దర్శకుడు చెబుతున్నాడు. నిర్మాత మాత్రం అనుకున్న బడ్జెట్ కంటే సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టానని.. ఈ లెక్కన సరిపోయిందని.. ఆ మాటకొస్తే దర్శకుడే తిరిగి ఇవ్వాలంటూ మాట్లాడుతున్నాడట. ఇలాంటి వ్యవహారాలు ఇప్పట్లో తేలవు.
ఒక సినిమా హిట్ అయిందంటే.. దర్శకనిర్మాతలు కలిసి ఇంకో సినిమా ప్లాన్ చేయడం చూస్తుంటాం కానీ ఇలా హిట్ సినిమా విషయంలో రెమ్యునరేషన్ కోసం గొడవ పడడం చాలా అరుదుగా చూస్తుంటాం. పైగా ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. రీమేక్ హక్కులు అమ్మాలంటే దర్శకుడి పర్మిషన్ తీసుకోవడంతో పాటు అతడికి వాటా కూడా ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్ తో నిర్మాత గొడవకి దిగడం హాట్ టాపిక్ గా మారింది.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!