Krack2: క్రాక్ సీక్వల్ పక్కా.. సంతోషంలో రవితేజ అభిమానులు!

తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక రవితేజతో తాజాగా ఈయన క్రాక్ సినిమా ద్వారాబ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఈయన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా రవితేజ నటించిన ధమాకా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రవితేజకు మంచి హిట్ అందించినటువంటి గోపీచంద్ మలినేని, బాబి, అనిల్ రావిపూడితో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ రవితేజతో తనకున్న రిలేషన్ గురించి చెప్పారు. తాను రవితేజ కోసం ఎలాంటి పనులు ఉన్న పక్కన పెట్టి తనతో పనిచేయడానికి ఇష్టపడతానని తెలిపారు. ఇక రవితేజతో కలిసి తాను తీసిన మూడు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. త్వరలోనే క్రాక్ 2కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఈ సందర్భంగా గోపీచంద్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

క్రాక్ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ అనగానే సీక్వెల్ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus