Gunasekhar: గుణశేఖర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. ఫ్యామిలీ పిక్ తో ఎమోషనల్ పోస్ట్

సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాంగోపాల్ వర్మ కొన్ని రోజులు శిష్యరికం చేసిన ఈయన… 1992 వ సంవత్సరంలో వచ్చిన ‘లాఠీ’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత అంటే 1995 లో సీనియర్ హీరో నరేష్, ఇంద్రజ లతో ‘సొగసు చూడ తరమా’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ కాకపోయినా గుణశేఖర్ కు మంచి దర్శకుడు అనే ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.

ఈ రెండు సినిమాలకు నంది అవార్డులు కూడా లభించాయి. ఇక అటు తర్వాత వచ్చిన ‘బాల రామాయణం’ ‘చూడాలని ఉంది’ ‘ఒక్కడు’ వంటి సినిమాలు గుణశేఖర్ ను స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ప్లాపులు వెంటాడాయి. అయితే ఇప్పటికీ కూడా ‘రుద్రమదేవి’ ‘శాకుంతలం’ వంటి బడా ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఈరోజు గుణశేఖర్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఆమె కూతురు నీలిమ గుణ తన ఫ్యామిలీ పిక్ తో తన తండ్రి (Gunasekhar) గుణశేఖర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ప్రియమైన నాన్నగారు మీ పై నాకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్ని పదాలైనా సరిపోవు.నాకు గొప్ప సపోర్ట్ మీరు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా..! నా పై మీ అమితమైన ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను. మా ప్రియమైన నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ లో గుణశేఖర్ ఫ్యామిలీ పిక్ బాగా హైలెట్ అయ్యింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus