Gunasekhar: నా భార్య లేకపోతే రూ.10 కోట్ల నష్టం.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో గుణశేఖర్ (Gunasekhar) ఒకరనే సంగతి తెలిసిందే. గుణశేఖర్ గత సినిమా శాకుంతలం ఒకింత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది. గుణశేఖర్ తన సినిమాలలో కొన్ని సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతను ఎంతలా దోచేస్తారో చెబుతూ గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కష్టార్జితాన్ని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టానని ఆయన తెలిపారు. అయితే మూవీ సెట్స్ పైకి వెళ్లే సమయానికే వృథా ఖర్చులు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.

షూటింగ్ లో పాల్గొనే వాళ్లకు భోజన వసతి కల్పించడానికి సంబంధించి మధ్యవర్తలు లక్షలాది రూపాయలు తీసుకునే వారని తెలిసి షాకయ్యానని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత నా భార్యను రంగంలోకి దించి ప్రొడక్షన్ ను కంట్రోల్ లో ఉంచానని గుణశేఖర్ తెలిపారు. నా భార్య ప్రొడక్షన్ పనులు చూసుకోవడం వల్ల 10 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కుటుంబం సపోర్ట్ లేకుండా పెద్ద ప్రాజెక్ట్ లను హ్యాండిల్ చేయడం సులువు కాదని గుణశేఖర్ వెల్లడించడం గమనార్హం.

గుణశేఖర్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు గుణశేఖర్ కొన్నిరోజుల క్రితం కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. యుఫోరియా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

గుణశేఖర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. గుణశేఖర్ త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు. గుణశేఖర్ కథ, కథనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus