రామ్‌చరణ్‌తో (Ram Charan) ఓ మంచి యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ పడితే హిట్ పక్కా అంటుంటారు టాలీవుడ్‌లో. గతంలో ఆయనకు అలాంటి కథలు రాసి, తీసిన దర్శకులు బ్లాక్‌బస్టర్ కూడా కొట్టారు. ఇప్పుడు మరో సినిమా అలాంటి ఎలిమెంట్స్‌తోనే సిద్ధమవుతోంది. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ పెట్టి చరణ్‌ను క్రీడాకారుడిగా కూడా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఆ సినిమా ఎఫెక్టో ఏమో.. హీరోను బాక్సర్‌గా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఓ యాంకర్‌కి వచ్చి యువ దర్శకుల దగ్గర ప్రస్తావించారు.
అందులో ఓ దర్శకుడు.. చరణ్ పేరును ముందుకు తీసుకొచ్చారు. ‘ప్రేమలు’తో (Premalu) తెలుగు ప్రేక్షకులను అలరించిన నస్లేన్ కె.గఫూర్ (Naslen K. Gafoor) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘జింఖానా’ (Alappuzha Gymkhana). ఖలీద్ రెహమాన్ (Khalid Rahman) రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు దర్శకులు హరీశ్ శంకర్ (Harish Shankar), అనుదీప్ (Anudeep Kv), సుజిత్ (Sujeeth), సందీప్ (Sundeep) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అప్పుడే బాక్సింగ్ నేపథ్యంతో ఓ సినిమా తెరకెక్కించే ఆలోచన ఉంటే ఏ హీరో బెటర్ అనే ప్రశ్న వేశారు. దానికి హరీశ్ శంకర్ స్పందిస్తూ రామ్‌చరణ్ పేరు చెప్పారు. రామ్‌చరణ్ బాడీకి బాక్సర్ పాత్రలు భలే కుదురుతుంది అని ఆయన ఫ్యాన్స్ అంటూనే ఉంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాలో కిక్ బ్యాగ్‌ని పంచ్ చేస్తూ చేస్తూ రామ్‌చరణ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్, ఆ వైబ్ మామూలుగా ఉండదు.
అందుకే చరణ్‌కు ఫుల్ ప్లెడ్జ్ బాక్సర్ రోల్ పడితే ఎలా ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. అందులోనూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘తమ్ముడు’ (Thammudu) సినిమాలో బాక్సర్‌గా కనిపించి బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్నారు. కాబట్టి చరణ్‌కు ఆ రోల్ పడితే వైబ్ అదిరిపోతుంది. మరి ఇలాంటి ఆలోచన ఎవరైనా చేస్తారేమో చూడాలి.