తెలుగు హీరోయిన్లకు న్యాయం చేయలేకపోతున్నా: హరీష్ శంకర్

కలర్స్ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమయ్యే అనంతరం హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మన తెలుగమ్మాయి స్వాతి. అయితే ఈమె కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈమె పేరు పక్కన కలర్స్ అనే పేరు వచ్చి చేరింది.ఇలా కలర్స్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన కలర్ స్వాతి పెళ్లయిన తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

ఇక చాలా రోజుల తర్వాత ఈమె పంచతంత్రం అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇక ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ కలర్స్ స్వాతి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కలర్స్ స్వాతి అంటే తనకు ఆల్ టైం క్రష్ అని ఈయన తెలిపారు. ఈమె కలర్స్ కార్యక్రమం చేస్తున్న సమయంలోనే తన క్రష్ గా మారిందని హరీష్ శంకర్ తెలిపారు.ఇక పంచతంత్రం సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ ఈ సినిమాకి టైటిల్ పెట్టినప్పుడే సగం సక్సెస్ సాధించారని ఈయన తెలిపారు. ఇక ఈ సినిమాలో చాలా మంది తెలుగువాళ్లే నటిస్తున్నారని ఈయన తెలిపారు.

తన సినిమాలో కూడా తెలుగు హీరోయిన్లకు అవకాశాలు కల్పించాలని చాలా ప్రయత్నం చేస్తానని అయితే కొన్నిసార్లు తెలుగమ్మాయిలకు న్యాయం చేయలేకపోతున్నాను అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ తెలుగు హీరోయిన్ల గురించి కూడా ఈ కార్యక్రమంలో చర్చించారు. ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus