Akira Nandan: పవన్ కుమారుడు అకీరా నందన్ ఫోటోలను షేర్ చేసిన రాఘవేంద్రరావు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఇంకా సినిమాలలోకి రాకముందే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అకీరాకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తన కుమారుడికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.

ఇక అకిరా (Akira Nandan) తన తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ఏవైనా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తప్పకుండా ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో సందడి చేస్తూ ఉంటారు. ఇలా అకిరా నందన్ ఇండస్ట్రీలోకి రాకముందే భారీగానే అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక చిన్న వయసులోనే ఈయన హీరో కటౌట్ కి ఏ మాత్రం తీసిపోరని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా అకిరా నందన్ ఫోటోలను దర్శకుడు కే రాఘవేంద్రరావు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా అలాగే తన మనవడు కార్తీక్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను కే రాఘవేంద్రరావు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వెంటనే డిలీట్ చేశారు అయితే అప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వీరి ఫోటోలను షేర్ చేసిన రాఘవేంద్రరావు వెంటనే ఈ ఫోటోలను డిలీట్ చేసేసారు. అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన వీరీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.

అకిరా కార్తిక్ ఇద్దరు కూడా యుఎస్ లో ఫిలిం ఇనిస్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అంటూ ఈయన తెలియజేశారు. ఇలా రాఘవేంద్రరావు ఈ ఫోటోని షేర్ చేస్తూ డిలీట్ చేయడంతో అప్పటికే ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇలా ఈయన వీరి గురించి తెలియచేయడంతో త్వరలోనే అకిరా నందన్ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారని, అందుకు తగ్గ తర్ఫీదు తీసుకుంటున్నారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా పవన్ వారసుడిగా అకిరాను ఎప్పుడు తెరపై చూడాలని ఆరాటపడుతున్నటువంటి అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus